వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును వదలకుండా వాయించేస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్లో విజయసాయి వ్యంగ్యాస్త్రాలు వేస్తునే ఉన్నాడు చంద్రబాబు పైన.  చంద్రబాబును ఎంపి ఓ పాథలాజికల్ లయ్యర్ అంటూ ఎద్దేవా చేశాడు. స్వభావ రీత్యా అబద్ధాలు చెప్పే వాళ్ళని పాథలాజికల్ లయ్యర్ అంటారుట. ఆలవోకగా, కళ్ళార్పకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పగలడు కాబట్టే పాథలాజికల్ లయ్యర్ అయ్యాడనేది ఎంపి లాజిక్. చంద్రబాబు లాంటివారు అబద్ధాలు చెప్పకుండా తమను తాము నియంత్రించుకోలేరని సోషల్ సైకాలజీ విశ్లేషణగా విజయసాయి వివరించారు. దావోస్ వెళ్ళినా, ముంబాయ్ ఐఐటి విద్యార్ధులతో మాట్లాడినా ఇలాగే కటింగులు ఇస్తుంటారట. ఇంతకీ విషయం ఏమిటంటే ముంబాయ్ ఐఐటి విద్యార్ధులతో జరిగిన వెబినార్ లో చంద్రబాబు మాట్లాడాడు. ఆ సమయంలో చంద్రబాబు కొట్టుకున్న సొంత డబ్బాను దృష్టిలో పెట్టుకుని విజయసాయి కామెంట్లు చేసిన విషయం అర్ధమైపోతోంది.




ఐఐటి విద్యార్ధులతో చంద్రబాబు  మాట్లాడుతూ  తనను తాను చాలా ఎత్తులకు ఎదిగిన నేతగా ప్రొజెక్టు చేసుకున్నారు. 20 ఇళ్ళు కూడా  లేని ఓ మారుమూల విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండే గ్రామంలో పుట్టిన తాను ఇంత ఎత్తుకు ఎదిగినపుడు మీరు మాత్రం ఎందుకు ఎదగలేరంటూ చంద్రబాబు వాళ్ళని ప్రశ్నించాడు. మామూలుగా అయితే విద్యార్ధులతో మాట్లాడేటపుడు వారిలో స్పూర్తి నింపేందుకు బాగా సక్సెస్ సాధించిన పారిశ్రామికవేత్తనో, క్లీన్ రికార్డున్న రాజకీయ నేతనో లేకపోతే మహాత్మా గాంధీ సిద్దాంతాలనో ఉదాహరణలుగా చెబుతారు. అంతేకానీ అందరు తనను ఆదర్శంగా తీసుకోమని తమకు తాము ఎవరు డప్పు కొట్టుకోరు. కానీ చంద్రబాబు చేసందిదే.  చంద్రబాబు రాజకీయ ఎదుగుదల ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అందరికీ గుర్తుంది. చంద్రబాబు మీదున్నన్ని అవినీతి ఆరోపణలు, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను  కొనుగోలు చేసిన చరిత్రున్న చంద్రబాబును విద్యార్ధులు స్పూర్తిగా తీసుకుంటే అంతే సంగతులు.




బహుశా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే విజయసాయి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును చెడుగుడు ఆడేసుకున్నాడు. అలాగే  చంద్రబాబు చెప్పుకున్నట్లుగా ఏపికి నిజంగానే తన హయాంలో రూ .15 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుంటే రాష్ట్రంలో నిరుద్యోగులే ఉండేవారు కాదని ఎద్దేవా చేశాడు. లక్షలమందికి ఉద్యోగాలు, ఉపాధి వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగ భృతి ఎందుకివ్వాల్సొచ్చిందో చంద్రబాబును జవాబు చెప్పమంటూ ఎంపి నిలదీశాడు. గొప్పలు చెప్పుకుంటూ చంద్రబాబు తన రిటైర్మెంట్ రోజులను గడిపేస్తున్నట్లు ఎంపి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవం జరిపితే కనీసం శుభాకాంక్షలు చెప్పాలని కూడా అనిపించలేదంటు ఎత్తిపోడిచారు.




తాను అధికారంలో ఉన్నంత కాలం విద్రోహదినమని, నిరసనదీక్షలని పిచ్చి పిచ్చి దీక్షలు, ఆందోళనలు చేయించాడు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 1వ తేదీని రాష్ట్రావతరణ దినోత్సవం జరిపితే  మాజీ ముఖ్యమంత్రి హోదాలో కనీసం రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పాలనిపించకపోవటం విచిత్రంగానే ఉంది.  ఒక్క  చంద్రబాబే కాదు టీడీపీ సీనియర్ నేతల్లోని ఏ ఒక్కరు కూడా రాష్ట్రావతరణ శుభాకాంక్షలు చెప్పలేదు. అంటే వీళ్ళందరికీ జగన్ అంటే ఎంత మంటగా ఉందో అర్ధమైపోతోంది. శుభాకాంక్షలు కూడా చెప్పటానికి మనసురాని జాతీయ అధ్యక్షుడిని మన రాష్ట్రంలోకి  అడుగుపెట్టనీయచ్చా ? అంటూ విజయసాయిరెడ్డి నెటిజన్లను సూటిగానే ప్రశ్నించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: