ఆయన రాజీనామా చేస్తే బాగు.. అబ్బా ఆయన రిజైన్ చేస్తే ఎంత బావుంటుంది.. ఆయన రాజీనామా చేస్తే మన బతుకులే మారిపోతాయి.. ఆయన రాజీనామా చేస్తే ఏకంగా లక్షలకు లక్షలు వచ్చి అకౌంట్లో పడిపోతాయి. ఆయన రాజీనామా చేస్తే.. గొర్రెలు, బర్రెలు వస్తాయి.. ఆయన రాజీనామా చేస్తే పాతహామీలన్నీ మళ్లీ అమల్లోకి వస్తాయి.. అబ్బా.. నిజంగా ఆయన రాజీనామా చేస్తే ఎంత బావుంటుంది.. ఇంతకీ ఆ ఆయన ఎవరు.. అంతగా ఆయన రాజీనామాను కోరుకునేది ఎవరు..?


ఆయన ఎవరో కాదు.. ఓ ఎమ్మెల్యే.. ఇంతకీ ఎక్కడ ఎమ్మెల్యే అంటారా.. అక్కడ, ఇక్కడ అని ఏమీ కాదు.. మొత్తం తెలంగాణ అంతటా ఇదే ఫీలింగ్.. అంటే.. ఇక్కడ ఫలానా ఎమ్మెల్యే అని కాదు.. తెలంగాణలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే ఫీలింగ్.. ఇందుకు ఒక్క గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, హుజూరాబాద్ మాత్రమే మినహాయింపు.. గజ్వేల్‌ ఎందుకంటే.. అది సీఎం నియోజక వర్గం. కాబట్టి ఆయన ఎలాగూ రాజీనామా చేయడు. ఇక మిగిలిన రెండు కేటీఆర్, హరీశ్ రావు నియోజక వర్గాలు.. వాళ్లూ రాజీనామా చేయరు. అంతే కాదు.. రాజీనామా చేయకపోయినా.. అక్కడ జనం అవసరాలు వాళ్ల ఎమ్మెల్యేలు బాగానే తీరుస్తున్నారు.


మరి ఎందుకు అన్ని చోట్లా జనం తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలనుకుంటున్నారు.. ఎందుకంటే.. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే.. ఉపఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే వరాల వర్షం కురుస్తుంది. పథకాల ప్రవాహం వస్తుంది. వాటితో తమ జీవితాలు మారిపోతాయి.. ఇదీ తెలంగాణలోని మిగిలిన నియోజక వర్గాల్లో జనం ఫీలింగ్..


హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి.. అక్కడ ఇతర సంక్షేమ పథకాలు ప్రాంభించినప్పటి నుంచి తెలంగాణలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే ఫీలింగ్ కనిపిస్తోంది. దళితులకు ఇంటికో పదివేలు.. గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు.. ఇంకా మిగిలిన వర్గాలకూ అడిన వాళ్లకు అడిగినంత.. అందుకే తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బాగు.. మాకూ ఉప ఎన్నిక వస్తే బాగు అన్నట్టుంది తెలంగాణ జనం సంగతి.  


మరింత సమాచారం తెలుసుకోండి: