రోజు రోజుకి ప్రజలకి స్థానికంగా తయారయ్యే వస్తువులపైనే ఆసక్తి బాగా పెరిగి పోతుంది. ఇక చైనా ఉత్పత్తులకు గుడ్ బై తెలియచేస్తున్నారు. ఇక వినాయకచవితి, దసరా  పండుగల తర్వాత .. దీపావళికీ చైనాకు పెద్ద షాక్ ఎదురు అవుతుంది.  ఈ సంవత్సరం దీపావళి పండుగ సందడి మొదలైంది. మార్కెట్లలో బాణసంచా ఔట్‌లెట్లు, బొమ్మల కొలువు వస్తువులు, ప్రమిదలు, దీపాలు ఇలా పండుగకు కావాల్సిన వన్నీ లభిస్తున్నాయి. స్వీట్ల షాపులు కూడా బాగా  కళకళలాడుతున్నాయి.

దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికీ... పండుగ నాడు... బొమ్మల కొలువు కోసం బొమ్మలు, అలంకరణ కోసం ప్రమిదలను మహిళలు పెద్ద ఎత్తున షాపులలో కొన్నుకుంటున్నారు. ఈ షాపుల్లో అందంగా తయారుచేసిన వివిధ ఆకృతులలో కనిపిస్తున్న ప్రమిదలు, ప్రతిమలు ప్రజలని బాగా ఆకట్టు కుంటున్నాయి. ఏనుగులు, కమలం, గుర్రాలు, నెమలి, ఒంటెలు, పూల తోరణాలు, ధ్వజస్తంభాలు, స్వస్తిక, దేవతల ప్రతిమలు చూడచక్కగా మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. ఇక మహిళల కోసం ఎక్కడికక్కడ ప్రత్యేక షాపులు వచ్చాయి అంటే నమ్మండి.


బాణసంచా ఔట్‌లెట్లకు పర్మిషన్లు లభించడంతో... అవి కూడా ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఐతే... ఈ సంవత్సరం ఎక్కువ మంది దేశీయంగా తయారయ్యే టపాసులనే కొనుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులోని శివకాశి నుంచీ పెద్ద సంఖ్యలో బాణసంచా రకాలు తెలుగు రాష్ట్రాలకు రావడం జరిగింది. ప్రతీ సంవత్సరం సరిగ్గా దీపావళి రాగానే... చైనా నుంచీ పెద్ద సంఖ్యలో బాణసంచా ఉత్పత్తులు మార్కెట్లోకి వెచ్చేవి. ఈసారి మాత్రం ప్రజలు చైనా వస్తువుల్ని కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో...  కూడా చైనా బాణసంచా కోసం వ్యాపారస్తులు కూడా  బాణసంచా ఆర్డర్ ఇవ్వడంలేదు.


ఇక బొమ్మల కొలువు విషయంలోనూ విదేశీ విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమల్ని కొనేందుకు ప్రజలు అసలు ఆశక్తి చూపించడం లేదు. గతంలో  ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి, దుర్గాదేవి, వినాయకుడు, సరస్వతి దేవి, శివుడి ప్రతిమలు చైనా నుంచీ పెద్ద మొత్తంలో స్టాక్ వచ్చేది. ఐదారేళ్లుగా ఈ పరిస్థితిలో బాగా మార్పు రావడం జరిగింది. స్థానికంగా తాయారు అయే వస్తువుల మీదే  ప్రజలకు  బాగా ఆశక్తి చూపుతున్నారు.  దీని కారణం వల్ల చైనా మార్కెట్ బాగా పడిపోవడం జరిగింది. ఇదివరకు ఈ విగ్రహాల్ని చైనా మాత్రమే అందంగా తయారు చేసేది. ప్రస్తుతానికి  టెక్నాలజీ ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చేయడంతో... మన దేశంలోనే వాటిని అద్భుతంగా తయారు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దీపావళికి చైనా ఉత్పత్తులు 10 శాతం కూడా లభించడం లేదు మార్కెట్లో.



మరింత సమాచారం తెలుసుకోండి: