దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం కూడా ఒక‌టి అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. అయ్యప్ప స్వామి ఆలయం సముద్ర మట్టం నుంచి సుమారు 400 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య  ఉంది. లక్షలాది భక్త జనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావటం జరుగుతుంది.

 

కాలినడకన దేవాలయం చేరే భక్తులు ఈ పొడవైన, కఠినమైన మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ భ‌క్తులు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి ముందుకు సాగుతుంటారు. ఇర ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అయితే ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్థావన ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే.

 

బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. అయితే ఆ 18 మెట్ల‌కు పేర్లు కూడా ఉన్నాయ‌ని చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. అవేంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. 1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: