కానీ కొంతమంది సందేహం ఏమిటంటే...ఆడవారు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు మరియు వ్రతాలను ఆచరించొచ్చా..? అయితే దీనికి కారణం ఒకసారి పరిశీలిస్తే గర్భవతిగా ఉన్నప్పుడే వారి ఇంటి ప్రభావం ఆమె పైన మరియు కడుపులో ఉన్న శిశువుపైన ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆ స్త్రీ గర్భవతిగా మూడు నెలలు దాటిన తరువాత నుండి ఇంటికి సంబంధించి ఎటువంటి పనిని చేయకూడదు...అంటే నిర్మాణం కానీ లేదా ఇంటి సర్దుబాట్లు కానీ ఏవీ చేయకూడదు. స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా? లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు.
అయితే కొంతమంది చెబుతున్న ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు తేలికపాటి పూజలు చేయవచ్చని, అలాగే కొబ్బరి కాయ మాత్రం కొట్టకూడదని చెబుతున్నారు. అంతే కాకుండా గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయకూడదు అంట....పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లకూడదని కొన్ని శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. కోటి సార్లు పూజ చేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడం కన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి లేదని కొంతమంది పూజారులు చెబుతుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి