బంగారం అంటే ఇష్టపడని వారుండారు. ముఖ్యంగా ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం. ప్రతి మహిళ పండుగలకు, ఇంట్లో జరిగే శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ మధ్య అయితే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినప్పటికీ బంగారం కొనుగోలు చేయడం మాత్రం తగ్గట్లేదు. బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గట్లేదు.  

ఇక ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం మంచిదని అంటుంటారు. ఎన్నో ఏళ్లుగా అక్షయ తృతీయ లాంటి మంచి రోజున బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. ఆ రోజున బంగారం కొంటే సిరిసంపదలతో ఉంటామని పెద్దలు అంటుంటారు. అందువల్ల చాలా మంది అక్షయ తృతీయ రోజున సిరిసంపదలతో ఉండాలని బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మామూలుగానే బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం ధరలు డబుల్, త్రిబుల్ అవుతాయి.

 
నేడు అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాగంటి కోటేశ్వరరావు అంటే తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రవచనాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే తాజాగా ఆయన అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఇలాంటి రోజున బంగారం కొంటే కలి పురుషుడు ఇంటికి వస్తాడని చెప్పారు. దానికి బదులుగా నీటి కుండలు దానం చేస్తే జన్మ జన్మల పుణ్యం వస్తుందని చాగంటి కోటేశ్వరరావు చెప్పుకొచ్చారు. పేదవారికి గొడుగు నవధాన్యాలు, చెప్పులు వంటివి ఇలాంటి పవిత్రమైన రోజున దానం చేస్తే మంచిదని తెలిపారు. అక్షయ తృతీయ రోజున నీటి కుండలు ధనం చేయలేని వాడు.. ఎంత బంగారం కొన్న సిరిసంపాదలతో ఉండలేడు. అలాగే ఈ రోజున శివుడికి తెల్ల బట్ట కట్టి దర్శనం చేసుకోవాలని చాగంటి కోటేశ్వరరావు చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: