సాధారణంగా గుడికి ఎందుకు వెళ్తాం..?? ప్రశాంతత కోసం.  అంతేకాదు దేవుడిని పూజిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని.. మనకున్న కష్టాలు తీరిపోతాయి అని .. పుణ్యం కోసం వెళ్తూ ఉంటాం . అయితే కొంతమంది దేవుడిని పూజించడానికి గుడికి వెళ్లిన గుడిలో తిరిగి వచ్చేటప్పుడు చేసే తప్పులు ఆ పుణ్యఫలాన్ని పాపాలుగా మార్చేస్తూ ఉంటుంది అంటూ పండితులు చెప్పుకొస్తున్నారు. గుడికి వెళ్ళిన వాళ్ళు చేసే కొన్ని తప్పులు కారణంగా వాళ్లకు పుణ్యఫలం లభించకపోగా పాపాలు వెంటాడే అవకాశం కూడా ఉంటుంది అంటూ ప్రముఖ జ్యోతిష్యులు చెప్పుకొస్తున్నారు. గుడికి వెళ్ళిన వాళ్ళు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


సాధారణంగా ఎవ్వరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచి వెళ్తారు . అంతేకాదు అలా వెళ్లే ముందు కాళ్లు తప్పనిసరిగా కడుక్కుంటూ ఉంటారు . ఆ తర్వాత కొన్ని నీళ్లు తలపై చల్లుకుంటారు . అప్పుడు శరీరం మనసు రెండు పవిత్రంగా ఉంచుకుంటున్నట్లు భావిస్తారు . అయితే కొంతమంది మాత్రం చెప్పులు బయట విడిచిన షూ వేసుకున్న వాళ్లు మాత్రం షూ ని బయటపెట్టి  సాక్స్ ని అలానే గుడిలో వేసుకుని తిరుగుతూ ఉంటారు . కాళ్ళకి పగుళ్లు వస్తాయి అని కాలు నల్లగా మారిపోతాయి అని రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు.  అది చాలా చాలా తప్పు అంటున్నారు పండితులు.



గుడిలోకి వెళ్లే ముందు చాలా మంది తెలియక ధ్వజస్తంభానికి ఎడమవైపు నుంచి వెళుతూ ఉంటారు . కానీ అది తప్పు అలా వెళ్లకూడదట.  ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి గుడి లోపలికి వెళ్లి భగవంతుడుని దర్శనం చేసుకోవాలట.  అప్పుడే పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందట . చాలామంది గుడికి వెళ్లే ముందు నవగ్రహాలను దర్శనం చేసుకోరు . దర్శనమైపోయిన తర్వాత నవగ్రహాలను దర్శించుకొని ఆ తర్వాత కాళ్లు  కడుక్కొని బయటకు వస్తూ ఉంటారు.  అది చాలా చాలా తప్పు అంటున్నారు పండితులు . జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా సరే మొదటగా నవగ్రహాలను దర్శించుకోవాలట .



ఆ తర్వాత కాలు కడుక్కొని దేవాలయంలోకి వెళ్లి భగవంతుని దర్శించుకోవాలట . ఆ తర్వాత కాలు కడుక్కోకూడదు అంటూ చెప్పుకొస్తున్నారు . అలాగే దర్శనం చేసుకునేటప్పుడు దేవుడికి ఎదురుగా అస్సలు నిలబడకూడదట . కొంచెం పక్కకు నిలబడి మాత్రమే భగవంతుని దర్శనం చేసుకోవాలట.  మరి ముఖ్యంగా కొంతమంది గుడికి వెళ్ళిన వాళ్ళు పూర్తిగా గుడికి తీసుకెళ్లిన సామాగ్రిని అక్కడే ఊడ్చేసి  వస్తూ ఉంటారు.  అలా చేయకూడదట గుడికి తీసుకెళ్లిన బుట్టలో ఒక్క పూవైనా సరే వెనక్కి తీసుకొని రావడం ఉత్తమమంటున్నారు పండితులు..!!



గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అని పాఠకులు గుతుంచుకోవాలి.  దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: