దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలో ప్రముఖులు, స్టార్ హీరోలు, క్రీడాకారులు విరాళాలు అందించడంతో పాటు కరోనాను కట్టడి చేయడం కోసం తమ వంతు కృషి చేశారు. 
 
గంగూలీ, సచిన్, సురేశ్ రైనా లాంటి క్రికెటర్లు కరోనా కట్టడి కోసం భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. మరికొందరు క్రీడాకారులు విరాళాలు ఇవ్వడంతో పాటు పోలీస్ అధికారిగా, హెల్ప్ లైన్ ప్రతినిధిగా కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. సాకర్ స్టార్ సీకె వినీత్ హెల్ప్ లైన్ ప్రతినిధిగా, మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ పోలీసు అధికారిగా మానసేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు. 
 
పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్, యూసఫ్ పేద ప్రజలకు ఆహారం అందించడంతో పాటు మాస్కులను పంపిణీ చేశారు. హర్భజన్ సింగ్ 3,000 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించగా గంగూలీ 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని పేద ప్రజలకు అందజేశారు. సచిన్ టెండూల్కర్ ముంబై మురికివాడల్లోని పేదలకు 5,000 మందికి సమకూర్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: