కరోనాతో పాకిస్థాన్ క్రికెట్ టీం వణికిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10మంది ఆటగాళ్లు ఈవైరస్ బారిన పడ్డారని పీసీబీ అధికారికంగా ప్రకటించింది.  ఇందులో నిన్న ముగ్గురు ఆటగాళ్లు హైదర్ అలీ , షాదాబ్ ఖాన్ ,హారిస్ రవూఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా ఈరోజు మరో ఏడుగురు ఆటగాళ్లకు పాజిటీవ్ వచ్చింది. వీరిలో కషిఫ్ బట్టి, హఫీజ్, మహమ్మద్ హస్నైన్ , ఫకర్ జమాన్ ,రిజ్వాన్  వాహబ్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్ వున్నారు. వీరందరూ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు.  
 
ఈ పర్యటనకు వెళ్లే ముందు ఆటగాళ్లందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది పీసీబీ. ఈనేపథ్యంలో 10మంది ఆటగాళ్లు  కరోనాబారిన పడడం సంచలనం రేపుతోంది. ఈనెల 28న పాక్ జట్టు ఇంగ్లాండ్ కు బయలుదేరాల్సి వుంది. ఆగస్టు - సెప్టెంబర్ లో ఆతిథ్య జట్టుతో పాక్ ,మూడు టెస్టులు,మూడు టీ 20ల్లో తలపడాల్సి వుంది అయితే ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో పర్యటన రద్దు  అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తం 29మంది ఆటగాళ్లను పీసీబీ ఈటూర్ కోసం ఎంపిక చేసింది. ఇందులో ఇప్పడు 10మంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. 
 
పాకిస్థాన్ (జట్టు) : 
అబిద్ అలీ ,ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్ , షాన్ మసూద్ , అజార్ అలీ (టెస్టు కెప్టెన్), బాబర్  అజామ్( టీ 20 కెప్టెన్), అసద్ షఫీక్ , ఫవాద్ ఆలమ్ ,హైదర్ అలీ,ఇఫ్తికర్ అహ్మద్,కుష్ దిల్ షా ,హఫీజ్ , షోయబ్ మాలిక్, రిజ్వాన్ (కీపర్), సర్ఫరాజ్ (కీపర్), ఫహీమ్ అష్రాఫ్ , హారిస్ రాఫ్ , ఇమ్రాన్ ఖాన్, అబ్బాస్ , హస్నైన్ , నసీం షా , షహీన్ షా ఆఫ్రిది ,సోహైల్ ఖాన్ , ఉస్మాన్ షాన్వారి , వాహబ్ రియాజ్ , ఇమాద్ వసీం , కషిఫ్ బట్టి , షాదాబ్ ఖాన్, యాసిర్ షా  

మరింత సమాచారం తెలుసుకోండి: