భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతున్నాయి.  మొదటి మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించిన టీమిండియా ఇక రెండవ మ్యాచ్లో కూడా అద్భుతం గా రాణించి విజయం సాధించి ఇక సిరీస్ కైవసం చేసుకుంటుంది అని అనుకున్నారు.  వన్డే సిరీస్ కైవసం చేసుకొని సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టును క్లీన్స్వీప్ చేస్తుంది అని అనుకున్నప్పటికీ రెండో వన్ డే మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు పుంజుకున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.


 ఇంగ్లాండ్ జట్టు ఎంతో అద్భుతం గా రాణించడం తో  టీమ్ ఇండియా ఓటమి చవి చూడాల్సినా పరిస్థితి ఏర్పడింది.  ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు టీమిండియా బౌలర్లు తో ఒక ఆట ఆడుకున్నారు అనే చెప్పాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను తక్కువ పరుగులకే పరిమితం చేయాలని భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇక విజయం సాధించ లేకపోయారు. చివరికి  టీమిండియా ఇచ్చిన టార్గెట్ 336 పరుగులను ఇంకా ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే చేదించింది ఇంగ్లాండ్.



 అయితే భారత్ ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ నితిన్ మీనన్ మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.  స్టోక్స్ రనౌట్ విషయంలో అసహనానికి లోనైనా విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ తో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే కోహ్లీ చెప్పేందుకు వికెట్ల దగ్గర కూర్చోగా నితిన్ మీనన్ మాత్రం కోహ్లీ ని లైట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లీ మరింత అసహనానికి లోనయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: