ఇటీవలే బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టును ఏకంగా రెండు జట్లుగా విభజించింది. అయితే సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టును అటు ఇంగ్లాండ్ పర్యటనకు పంపించింది భారత జట్టు.  అదే సమయంలో ఎంతో మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టును శ్రీలంక టూర్ కి పంపించింది. ఇక శ్రీలంక టూర్ లో భాగంగా వన్డే టి20 సిరీస్ ఆడింది భారత జట్టు. ఇక లంక పర్యటన లోని టీమిండియా జట్టు కోచ్ శిఖర్ ధావన్ సారథ్య బాధ్యతలను నిర్వహించాడు. అయితే  ఇక లంక పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడింది భారత జట్టు. వన్డే సిరీస్లో భాగంగా భారత జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక మూడో మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ సిరీస్ మాత్రం భారత్ కే దక్కింది   ఇక టి20 సిరీస్ విషయానికి వస్తే మాత్రం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ భారత్ విజయం సాధించింది ఇక రెండో మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్నదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే శ్రీలంక జట్టు అద్భుతంగా పుంజుకుంది. లంక బౌలింగ్ విభాగం భారత బ్యాట్స్మెన్లను  కట్టడి చేయడంలో విజయం సాధించారు. దీంతో రెండో టీ-20 మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయం సాధించింది.  దీంతో ఇక మూడవ టి20 మ్యాచ్ ఫలితం తేల్చే మ్యాచ్ గా మారిపోయింది  అయితే అప్పటి వరకు అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు ఒత్తిడిని మాత్రం జయించ లేకపోయారు. దీంతో ఇక వరుసగా వికెట్ చేజార్చుకున్న పెవిలియన్ చేరారు భారత ఆటగాళ్లు. దీంతో తక్కువ పరుగులకే ఆలౌట్ కావడంతో ఇక శ్రీలంక జట్టు మూడో టి20 మ్యాచ్ లో ఘనవిజయం సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.



 ఇటీవలే లంక పర్యటనకు వెళ్లిన టీం ఇండియా జట్టుపై మాజీ క్రికెటర్ యుజువేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక పర్యటనతో టీమిండియా కు ఎలాంటి ప్రయోజనం లేదు.. ఈ విషయం బిసిసిఐకి కూడా తెలుసు అంటూ వ్యాఖ్యానించారు మాజీ క్రికెటర్ యుజువేంద్ర సింగ్. ఆర్థిక కష్టాల్లో ఉన్న లంక బోర్డును ఆదుకునేందుకు బిసిసిఐ కరుణా హృదయంతో  ఇలా లంక టూర్ ప్లాన్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా సహాయం చేయడం మంచిదే కానీ.. దేశం యొక్క పరువు ప్రతిష్ట గురించి కూడా ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు.   అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ అంటే బిసిసిఐ నిర్వహించే ఐపీఎల్ కాదని..  ఐపీఎల్ లో ఆడినంత తేలికగా అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేరు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: