మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది.  ఈ క్రమంలోనే మళ్ళీ ఇక అసలు సిసలైన క్రికెట్ మజా ని పొందేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం అన్ని జట్ల ఆటగాళ్లు కూడా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా మళ్లీ ఉత్కంఠభరితమైన పోరు కోసం నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు.  అయితే గత రెండు మూడు సీజల న్ నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. జట్టులోని ఆటగాళ్లు అందరినీ సమన్వయం చేస్తూ ప్రతి ఒక్కరు జుట్టు కోసం, జట్టు విజయం కోసం పోరాడే విధంగా అందరిలో స్ఫూర్తి నింపాడు శ్రేయస్ అయ్యర్. గత ఏడాది యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ ఇక దిగ్గజ ముంబై ఇండియన్స్ చేతిలో టైటిల్ పోరులో ఓడి పోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ భుజం గాయం బారిన పడటంతో అయ్యర్ కి బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు రిషబ్ పంత్ చేతికి అప్పజెప్పింది యాజమాన్యం.



 ఇకపోతే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ భుజం గాయం నుంచి కోలుకుని పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఇక రానున్న ఐపీఎల్ సీజన్ 2 లో ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు అన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇక 2021 ఐపీఎల్లో రిషబ్ పంత్  కెప్టెన్గా కొనసాగుతాడు అంటూ తేల్చి చెప్పింది జట్టు యాజమాన్యం.  దీంతో అటు శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇక కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వచ్చే సీజన్లోనే అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl