మొన్నటివరకులీగ్ మ్యాచ్ లతో దూసుకుపోయిన టి20 వరల్డ్ కప్ ల ఇప్పుడు ఎంతో రసవత్తరంగా మారింది. సెమీఫైనల్లో స్థానాన్ని దక్కించుకోవడానికి  ప్రతి ఒక్క జట్టు కూడా ప్రస్తుతం హోరాహోరీగా పోరాడుతున్నాయి. కొన్ని జట్లు అయితే కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని సెమీఫైనల్ పై ఆశలు పెట్టుకున్నాయి అని చెప్పాలి.  కొన్ని జట్లకు సెమీ ఫైనల్ చేరుకోవడానికి ఇతర జట్ల ప్రదర్శనలు మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ అదృష్టం వరించి ఇతర జట్లు ఓడిపోయాయి అంటే సెమీ ఫైనల్కు చేరుకునే అవకాశాలు దక్కించుకుంటూ కొన్ని జట్లు. ఇలాంటి వాటిలో అటు టీమిండియా కూడా ఉంది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమిండియా ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో మాత్రం అద్భుతంగా రాణించింది.


 ఇక రెండు మ్యాచ్ లలో కూడా భారీ తేడాతో విజయం సాధించడంతో టీమ్ ఇండియా రేట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇక టీమ్ ఇండియా సెమీ ఫైనల్కు వెళ్లడంపై భారీగానే ఆశలు పెట్టుకుంది అని చెప్పాలి. అయితే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్ళడం అనేది తమ ప్రదర్శన పై ఆధారపడి లేదు. న్యూజిలాండ్ ప్రదర్శన పై ఆధారపడి ఉంది. నవంబరు 7వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి న్యూజిలాండ్ ఓడిపోతే టీమిండియా సెమీస్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇక నవంబరు 7వ తేదీన జరగబోయే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలని భారత్ అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక ఇప్పుడు టీమ్ ఇండియా సెమీ ఫైనల్కు చేరాలా లేకపోతే ఇంటికి పోవాలా అన్నది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న రషీద్ బాగా రాణించి వరుసగా వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగాన్ని కుప్పకూల్చాడు అంటే ఇక న్యూజిలాండ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్ బాగా రాణించాలని కోరుకుంటున్నారు భారత అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: