క్రికెట్ ను ప్రపంచ దేశాలలో ఎంతలా ఆదరిస్తారో తెలిసిందే. దీనిని ఆధారంగా చేసుకుని దాదాపు అన్ని క్రికెట్ దేశాలు వివిధ రకాల క్రికెట్ లీగ్ లను ముందుకు తీసుకువచ్చి వీరిని మరింత ఎంటర్టైన్ చేస్తున్నారు. అందులో భాగంగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం క్రికెట్ బోర్డు అబుదాబి టీ 10 లీగ్ ను గత రెండు సంవత్సరాల నుండి నిర్వహిస్తోంది. ఈ లీగ్ లో మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఇప్పటికే టీ 20 లీగ్ లలో ఆటగాళ్ల విద్వంసాన్ని తట్టుకోలేకుంటే ఇప్పుడు టీ 10 లో అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రతి బంతికి బౌండరీ లక్ష్యంగా సాగే వీరి బ్యాటింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మొదటి సీజన్ లో అంతగా ఎవరికీ తెలియని ఈ లీగ్. రెండవ సీజన్ కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచ దేశాల నుండి ఆటగాళ్లు వచ్చి ఇందులో ఆడుతున్నారు. నిన్నటి వరకు 28 మ్యాచ్ లు జరిగాయి. ఈ సీజన్ లో ఇంకా ఏడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత సంవత్సరం నికోలస్ పూరం సారథ్యంలో నార్తర్న్ వారియర్స్ టైటిల్ ను గెలుచుకోగా... ఈ సారి కొత్త జట్టు టైటిల్ ను అందుకునే ఛాన్సెస్ ఎక్కవగానే ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ లీగ్ లో కూడా వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ తమ దూకుడైన ఆటతీరుతో సెలెక్టర్లు ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా వీరిలో ఇంకా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడని ప్లేయర్స్ ఉండడం గమనార్హం.

వారిలో ఒడియాన్ స్మిత్, డొమినిక్ డ్రేక్స్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రోమారియో షెఫర్డ్, కెన్నర్ లూయిస్ లు వారి జట్టులో కీలకముగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఒడియాన్ స్మిత్, డ్రేక్స్, షెపర్డ్ లు అల్ రౌండర్ లు కావడం విశేషం. ఎంతటి స్థితిలో అయినా జట్టును ఆదుకునే ఆటతీరు వీరి సొంతం. భవిష్యత్తులో వారు ఏ జట్టుకు ఆడినా పెద్ద బలం అన్ని చెప్పాలి. అయితే వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్ సీజన్ ౧౫ కు మెగా వేలం జరగనుండగా వీరికి అదృష్టం వారించే అవకాశం లేకపోలేదు. ఐపీఎల్ జట్ల కోచ్ లు సైతం ఈ లీగ్ పై ఒక చూపు వేసి ఉన్నారు. మరి వీరిలో ఎవరు జాక్ పాట్ కొడుతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: