భారత క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెమ్మదైన ఆటతీరు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాహుల్ ద్రవిడ్  తన అద్భుతమైన ప్రతిభతో ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో సేవలు అందించాడు. ఇక తనకంటూ భారత క్రికెట్ లో ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు రాహుల్ ద్రవిడ్. ఇండియన్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్ గా ఉన్నా ఎంతోమందిలో రాహుల్ ద్రవిడ్ కూడా ఒకడిగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు మూడు ఫార్మట్ లలో కూడా సేవలందించిన రాహుల్ ద్రావిడ్. అటు భారత జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.



 ఒకవైపు కెప్టెన్గా మరోవైపు కీలక ఆటగాడిగా తన ఆటతో తన కెప్టెన్సీని తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో ఆటగాడిగా సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ఆ తర్వాత  ఇక అండర్ నైన్ టీన్ జట్టుకు కోచ్గా అవతారమెత్తి ఎంతోమంది ప్రతిభ గల యువ ఆటగాళ్లను భారత క్రికెట్ కు అందించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.. ప్రస్తుతం భారత జట్టు  యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తుంది అంటే దానికి అండర్-19 జట్టుకు కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కారణం. ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ గా మారిపోయాడు ఈ దిగ్గజ క్రికెటర్.



 అయితే ప్రపంచ క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ సాధించిన పలు రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇంటర్నేషనల్ క్రికెట్ లోఎక్కువ బంతులను ఎదుర్కొన్న ప్లేయర్గా రాహుల్ ద్రవిడ్ సృష్టించిన రికార్డు ఇప్పటికీ ఎంతో పదిలంగానే ఉంది.


2. అయితే ప్రపంచ క్రికెట్లో టెస్ట్ క్రికెట్ ఆడే పది దేశాలలో కూడా రాహుల్ ద్రవిడ్ సెంచరీ చేశాడు. అయితే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రాహుల్ ద్రవిడ్ రికార్డును సృష్టించాడు.


3. క్రీజులో ఎక్కువ సమయం పాటు గడిపిన క్రికెటర్గా కూడా రాహుల్ ద్రావిడ్ ఒక ప్రత్యేకమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


4. వికెట్ కీపర్ గా కాకుండా ఒక ఫీల్డర్ గా టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ క్యాచ్లు పట్టిన ఆటగాడిగా కూడా అరుదైన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిటే ఉంది.

5. టెస్ట్ క్రికెట్ లో నెంబర్ మూడవ స్థానంలో మైదానంలోకి వచ్చి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు రాహుల్.


6. వరుసగా నాలుగు మ్యాచ్ లలో సెంచరీ చేసిన ఏకైక భారత క్లియర్ గా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: