భారత క్రికెట్లో ఎంతో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది.  టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని జట్టులో కొనసాగుతోన్న విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు విరాట్ కోహ్లీ. ఇన్ని రోజుల వరకు తనకు మద్దతుగా నిలిచిన బిసిసిఐకి అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు విరాట్ కోహ్లీ. అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్కు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగుతూ ఉండగా..  విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతున్నాడు.


 అయితే విరాట్ కోహ్లీ సారథ్యంలో సౌత్ ఆఫ్రికా పర్యటన లో టీమిండియా జట్టు సత్తా చాటుతోంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మళ్ళీ టీమిండియాకు నిరాశే ఎదురైంది. సిరీస్  చేజార్చుకుంది టీమిండియా.  సిరీస్ లో ఓటమిపాలైన కేవలం 24 గంటల వ్యవధిలోనే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 68 టెస్టులకు నాయకత్వం వహించిన మ్యాచ్ లలో టీమిండియాకు విజయాన్ని అందించి విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు సంపాదించాడు విరాట్ కోహ్లీ. టెస్ట్ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పడం తో ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


  ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయం తనను విస్మయానికి గురిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. షాక్ అయ్యాను.. భారత జట్టు కెప్టెన్గా విజయవంతమైన నీకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లీ అంటూ తెలిపిన రోహిత్ శర్మ.. నీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: