ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టు ఇటీవలే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో మాత్రం కనీస పోటీ ఇవ్వలేక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. ఇక ఛాంపియన్ జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఐదు టెస్టుల సిరీస్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అయితే వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను ఆస్ట్రేలియా కు అప్పజెప్పింది ఇంగ్లాండ్ జట్టు. ఏ దశలో కూడా ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లండ్ జట్టు పోటీ ఇస్తున్నట్లు కనిపించలేదు . అయితే ఇలా యాషెస్ సిరీస్లో పేలవ ప్రదర్శనతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఒత్తిడి లో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు..  టెస్టు జట్టు కెప్టెన్గా ఉన్న జోరూట్ మొదటిసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మెగా వేలంలో పాల్గొనడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ ఇటీవలే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నా అంటూ ప్రకటించాడు జో రూట్. తన జట్టు కోసం ఎంతో చేయాల్సిన అవసరం ఉందని.. అందుకే ఐపీఎల్లో ఆడటాన్ని కూడా త్యాగం చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మరో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.


 ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చే నెలలో జరగబోయే మెగా వేలంలో బెన్ స్టోక్ తన పేరును నమోదు చేసుకోకపోవడం గమనార్హం. యాషెస్ సిరీస్లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బెన్ స్టోక్స్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో వచ్చే సీజన్ కోసం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలనే లక్ష్యంతోనే ఐపీఎల్  నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ బెన్ స్టొక్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl