పాకిస్తాన్ తో శత్రుత్వం నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు పాకిస్తాన్ పర్యటనపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఎన్నో దశాబ్దాల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక మ్యాచులు జరగడం లేదు అని చెప్పాలి. అచ్చం ఇలాగే ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా పాకిస్థాన్లో పర్యటన పై నిషేధం విధించాయ్. దీంతో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాలంటే పాకిస్థాన్ యూఏఈ వేదికగా ఇతర జట్లతో ద్వైపాక్షిక మ్యాచ్ లు ఆడటం లాంటివి చేస్తూ ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు కొన్ని జట్లు పాకిస్థాన్లో పర్యటనకు వెళ్లేందుకు ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. గతేడాది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ లాంటి జట్లు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాయ్. కానీ చివరి నిమిషంలో భద్రతాపరమైన కారణాల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకున్నాము అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇలా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ లాంటి జట్లు పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకోవడానికి వెనుక భారత్ కూడా ఉంది అంటూ ఎన్నో విమర్శలు కూడా చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.  ఇక ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్లో పర్యటించింది. ఇక ఇప్పుడు మరో జట్టు కూడా పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది.. ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ టూర్ కి వెళ్ళబోతుందట. దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత ఇలా పాకిస్థాన్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఒకవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇలా పాకిస్తాన్ టూర్ ప్లాన్ చేసినప్పటికీ ఆసీస్ ఆటగాళ్లు మాత్రం పాక్ ఈ టూర్ కు వెళ్లేందుకు కాస్త జంకుతున్నారు అన్న టాక్ ప్రస్తుతం మొదలైంది.


 అయితే ఇక ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పాక్ టూర్ కు సంబంధించి ఆమోదం లభించగానే జట్టును ప్రకటిస్తామని ఆస్ట్రేలియా సెలెక్టర్లు తెలిపారు. అయితే ఆస్ట్రేలియా జట్టులో ఉన్న పలువురు కీలక ప్లేయర్లు మాత్రం పాకిస్తాన్ వెళ్లేందుకు కాస్త భయపడిపోతున్నారట. ఎందుకంటే గతంలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. ఏకంగా బస్సు పై బాంబు దాడి జరగడం సంచలనంగా మారింది. అప్పటి నుంచి అన్ని దేశాలు పాకిస్థాన్ పర్యటన పై నిషేధం విధించాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: