ఇదిలా ఉంటే ఇక ఈ 16 కోట్ల ధరను ఐపీఎల్ మెగా వేలంలో ఎంతో మంది ఆటగాళ్లు బ్రేక్ చేసే అవకాశం అని మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ ఎంతో అద్భుతంగా జట్టును ముందుకు నడిపించి తన కెప్టెన్సీ తో ఆకట్టుకున్నా శ్రేయస్ అయ్యర్ కి భారీ డిమాండ్ ఉండబోతుందని ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఇటీవలే ఆకాష్ చొప్రా స్పందించాడు. మెగా వేలంలో ఏ జట్టు ఎవరిని ఎంత ధరకు దక్కించుకుంటుంది అనేదానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మెగా వేలంలో యంగ్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్ కు భారీ ధర పలికే అవకాశం ఉందని కూడా అంచనా వేశాడు. శ్రేయస్ అయ్యర్ దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా 20 కోట్ల రూపాయలను పక్కన పెట్టుకుందని తనకు సమాచారం అందింది అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సి కూడా ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేసాడు. గత ఏడాది ఐపీఎల్ లో ఓడిపోయిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా పడుకుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్ ను ఎలాగైనా దక్కించుకోవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణయించుకుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి