ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. నిన్న సాయంత్రం 7:30 గంటలకు ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఛాంపియన్గా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇక రన్నరప్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతం గా రాణిస్తుంది అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం చేతులెత్తేసింది అన్న విషయం తెలిసిందే. ఒకానొక సమయం లో కనీసం గౌరవ ప్రదమైన స్కోరు అయిన చెన్నై సూపర్ కింగ్స్ చేయ గలుగుతుందా లేదా అన్నది అర్థం కాని విధం గా మారి పోయింది.


 ఇలాంటి సమయం లోనే మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతం గా రాణించాడు. మొదట్లో  మహేంద్రసింగ్ ధోని అందరూ బ్యాట్ మెన్స్ లాగానే నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని వాటిని చూసి అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగి పోయారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా రాణించాడు. ధనాధన్ పటపట్ అనే రేంజ్ లో ఫోర్లు సిక్సర్లతో చెలరేగి పోయాడు.


 ఈ క్రమం లోనే చాలా రోజుల తర్వాత మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనే చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడం పై స్పందించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఇన్నింగ్స్ బాగుందని కితాబు ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. ధోని నెమ్మదిగా స్టార్ట్ చేసాడు కానీ తన అనుభవం ప్రశాంతత దూకుడు కామన్సెన్స్ ఉపయోగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ మంచి స్కోర్ చేయగలిగింది అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: