
భారీగా అభిమానులను కలిగి ఉన్న విరాట్ కోహ్లీ.. సచిన్, ధోనీ తర్వాత అత్యంత పాపులర్ అయిన క్రికెటర్గా కొనసాగుతున్నాడూ ఇక అసలు విషయంలోకి వెళితే ఇంగ్లీష్ క్రికెట్ విజ్డెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నీ వేలం వేయటానికి రెడీ అయ్యింది. తొలి సంతకంతో కూడిన జెర్సీ ఫ్రెమ్ లో ఒక ఫోటో పెట్టింది అయితే జెర్సీ తో పాటు కోహ్లీకి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఫ్రెమ్ లో పెట్టింది. ఇక ఈ జెర్సీని ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్లైన్ పద్ధతిలోనే వేలం వేయడానికి నిర్ణయించి అభిమానులందరికీ కూడా శుభవార్త చెప్పింది. ఒకవేళ అభిమానులు ఎవరైనా సరే కోహ్లీ జెర్సీని దక్కించుకోవాలి అనుకుంటే మాత్రం విజ్డెన్ వెబ్సైట్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
విరాట్ కోహ్లీ యొక్క జెర్సీ ప్రారంభ ధరను 2499.99 నిర్ణయించింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ 2.42 లక్షలుగా ఉంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ జెర్సీ ఎంతకు అమ్ముడుపోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది . కాగా విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఇక జెర్సీ కొనుగోలు చేసేందుకు పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది ఈ క్రమంలోనే ఎంతో మంది పోటీ పడి మరీ భారీ ధరకు ఈ జెర్సీని దక్కించుకోవడం ఖాయమని ప్రస్తుతం విరాట్ కోహ్లీ అభిమానులు అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఒక సాదా సీదా ఆటగాడి గానే కొనసాగుతూ ఉన్నాడు..