ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఈసారి గడ్డు పరిస్థితులు  ఎదురయ్యాయి. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజా కెప్టెన్సీలో వరుస పరాజయాలతో సతమతమయ్యింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ క్రమంలోనే ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జడేజా మహేంద్ర సింగ్ ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాడు. దీంతో అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు అని చెప్పాలి. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతుంది  అని అంచనాలు పెట్టుకున్నారు.


 ఈ క్రమంలోనే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ధోనీ తన దైన వ్యూహాలతో మళ్ళీ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ధోనీ కెప్టెన్సీలో జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా రెండు విజయాలు సాధించింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది ఇక చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా భారీ విజయాలు నమోదు చేస్తే  ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.  ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అభిమానులు అందరిలో కూడా ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. 40 ఏళ్ల మహేంద్రసింగ్ ధోని అందుబాటులో ఉంటాడా లేదా అని. ఇటీవల ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 వచ్చే సీజన్లో ధోని ఉన్నాడా లేదా అనేది ప్రతి అభిమాని ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం ధోనీ జట్టులోనే లేకపోయినా చెన్నై మేనేజ్మెంట్ లోనైనా భాగం కావాలని కోరుకుంటారు. ధోని ఏం చేస్తాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. టీమిండియా కోసం ధోనీ చేసిన సేవలకు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము. గౌరవిస్తూనే ఉంటాము. ధోని ఖచ్చితంగా వచ్చే సీజన్లోనే ఆడుతాడు అని నేను భావిస్తున్నాను. టీమ్ లో లేకపోయినా మేనేజ్మెంట్ లో భాగం కావచ్చు. ధోని కోహ్లీ ఒక బ్రాండ్ వాళ్ళిద్దరు ఫ్రాంచైజీ కంటే ఎక్కువ అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక ధోని వచ్చే ఏడాది అద్భుతంగా ధోని పునరాగమనం చేయాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో తెలిపాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి: