ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ లో కేవలం టెస్టు ఫార్మాట్ కి మాత్రమే ఎక్కువగా గుర్తింపు ఉండేది. ప్రతి ఒక ఆటగాడు టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలంటూ ఆశ పడుతూ ఉండేవాడు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం టి20 ఫార్మాట్ వచ్చిన తర్వాత అటు టెస్ట్ ఫార్మాట్ కి పూర్తిగా ప్రాధాన్యత తగ్గి పోతుంది అని చెప్పాలి. చాలా మంది క్రికెటర్లు అటు టెస్టు ఫార్మాట్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి. ఎంతో మంది యువ ఆటగాళ్లు సైతం టి20 ఫార్మాట్లో చోటు దర్శించుకుంటే  చాలు అని భావిస్తున్నారు. ఇక ప్రతి ఆటగాడి ప్రతిభను వెలికి తీసే టెస్టు ఫార్మాట్లో  ఆడాలని కోరుకునే ఆటగాళ్ళ సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.


 అటు ప్రేక్షకుల నుండి సైతం రోజు రోజుకి టి20 ఫార్మాట్ కి ప్రాధాన్యత  నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ ని ఆదరించేవారు లేకుండా పోయారు. టెస్ట్ మ్యాచ్ లు వస్తున్నాయి అంటే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. టి20 మ్యాచ్ లు వస్తున్నాయి అంటే టీవీలకు అతుక్కుపోతున్నారు. దీంతో ఇక రానున్న రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం ఇదే విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే టి20 క్రికెట్ కావాలి అని జనాలు అనుకుంటున్నారు.  టి20 మ్యాచ్ లనే చూడాలి అని భావిస్తున్నారు. ఇక ఇలాంటి స్థితిలో ఏ ఆటగాడైనా ఐదు లక్షల కోసం ఐదు రోజులు క్రికెట్ ఆడాలని కోరుకోరు.. టి20 మ్యాచ్ ఆడితే కనీసం యాభై లక్షలు సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేయని కుర్రాళ్లు సైతం ఐపీఎల్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక టీ20 క్రికెట్ ను చూసిన కళ్ళతో వన్డే మ్యాచ్ను చూసిన కూడా టెస్ట్ క్రికెట్  చూసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక 20 ఓవర్లు గెలిచిన తర్వాత ఇంకా 30 ఓవర్లు బ్యాటింగ్ చేయాలా అనిపిస్తుంది.  ఇటీవలి కాలంలో టి20 లదే హవా నడుస్తోందిఅని చెప్పడానికి  ఇదే ఒక ఉదాహరణ అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: