ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ కెప్టెన్సీలో పడుతూ లేస్తూనె ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ  ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహించగా ఆ తర్వాత అతన్ని తప్పించి రిషబ్ పంత్ కు కెప్టెన్సీ అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం. ఇక కొన్నాళ్లపాటు ఇలా కెప్టెన్సీ మార్పు పై తీవ్రమైన చర్చ జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చిన తర్వాత అతనికి కెప్టెన్సీ ఇస్తారు అనుకున్నప్పటికీ ఇక రిషబ్ పంత్ కెప్టెన్గా కొనసాగుతాడు జట్టు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇటీవల ఇదే విషయంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ జట్టును నడిపించడంలో శ్రేయాస్ కంటే పంత్ సరైన ఆటగాడు అని ఆ జట్టు హెడ్ కోచ్  రికీ పాంటింగ్ భావించి ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.  కాగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ ని వదిలేయాటంతో ప్రస్తుతం కోల్కత నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు.


 అయితే ఇటీవల ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన అజయ్ జడేజా.. రికీ పాంటింగ్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరితో కలిసి పనిచేశాడు. దీంతో శ్రేయస్ కన్నా రిషబ్ పంత్ మెరుగైన ఆటగాడు అని భావించి ఉంటాడు. ప్రస్తుత సీజన్లో పంత్ నిర్ణయాలు బాగున్నాయి. అతను  దూకుడు కలిగిన క్రికెటర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతనిని చూస్తుంటే చిన్నవయసులోనే సీనియర్ ఆటగాడిగా పరిపక్వత కనిపిస్తుంది. బ్యాట్స్మెన్గా కూడా రాణిస్తున్నాడూ. సాధారణంగా కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ఎవరో ఒకరి ప్రోత్సాహం ఉంటుంది. పంత్ వెనుక పాంటింగ్ ఉన్నాడని తెలుస్తుంది అంటూ అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: