ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. కొంతమంది సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో సత్తా చాటుతూనే ఉంటారు. అంతే కాదు అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారు మాత్రం సహచరులుగా మారిపోయి హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంత మంది ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ కూడా సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఎప్పుడూ మెరుపు ఫీల్డింగ్ చేస్తూ అదరగొడుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంత మంది ఆటగాళ్ళు పట్టే అద్భుతమైన క్యాచ్ లూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. ఈ క్రమంలోనే ఇక ఒకే సీజన్లో ఒక బౌలర్ ఎక్కువ వికెట్లు తీశాడు అనేది ఎలా కౌంట్ చేస్తూ ఉంటారో అలాగే ఒకే సీజన్లో ఒక ఆటగాడు ఎన్ని క్యాచ్ లూ పట్టాడు అన్న విషయాన్ని కూడా లెక్కిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి రికార్డులు సాధించిన ఆటగాళ్లు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చాలామంది ఉన్నారు. మరి ఒక సీజన్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్ లూగాఎవరు కొనసాగుతున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.



 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఎబి డివిలియర్స్ 2016లో ఒకే సీజన్లో 19 క్యాచ్ లు అందుకునీ ఈ లిస్టులో టాప్లో కొనసాగుతున్నాడు. 2022 సీజన్లో రియాన్ పరాగ్ ఇప్పటివరకు  15 క్యాచ్ లూ అందుకుని రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కిరణ్ పోలార్డ్ 2017 లో పదిహేను క్యాచ్ లూ అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 2014 సీజన్లో 14 క్యాచ్ లు అందుకున్నాడు.  బ్రావో 2013 సీజన్లో 14 క్యాచ్ లు అందుకునీ ఈ లిస్టులో కొనసాగుతూ ఉండడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl