ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్స్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టు విజయఢంకా మోగించింది. రాజస్థాన్ రాయల్స్ కి మరోసారి నిరాశ తప్పలేదు. ఫైనల్ చేరడానికి రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మరోసారి తలపడేందుకు   సిద్దం అవుతుంది. అయితే ఇక ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు హార్దిక్ పాండ్యా కు పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పాలి. గత కొంతకాలంగా గాయాలతో బాధపడిన హార్దిక్ పాండ్యా ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తు బాగా రాణిస్తున్నాడు.


 టీమిండియాకు దూరమై ఎన్నో రోజుల తర్వాత మళ్లీ ఇటీవల తన ప్రదర్శనతో సెలెక్టర్లు దృష్టిని ఆకర్షించి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇలాంటి సమయంలో అభిమానులందరూ షాక్ లో మునిగి పోయారు.  డెత్ ఓవర్లలో మీడాన్ లో ఫీల్డింగ్  చేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. యష్ దయాల్ వేసిన బౌలింగ్లో బట్లర్ మీడ్ ఆన్ లోనే బంతి గాల్లోకి లేచింది. అక్కడ హార్దిక్ పాండ్యా ఉండడంతో ఇక బట్లర్ అవుట్ కావడం తప్పదు అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే గాల్లో ఎగిరే బంతిని చేరుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా పరిగెడుతుంటే  ఒక్కసారిగా కిందపడిపోయాడు.


 మైదానం కాస్త చిత్తడిగా ఉండడం తో కాలు స్లిప్ కిందపడిపోయాడు. దీంతో అభిమానుల ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం హార్థిక్ పాండ్యా వెన్నెముక సర్జరీ చేయించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను పడిన తీరు చూసి మరోసారి గాయం కాక తప్పదు అని అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా అదృష్టవశాత్తు వెంటనే లేచి నవ్వుతూ ఆటను కొనసాగించాడు. ఇప్పటికి గాయం కారణంగా ఈ ఏడాది పాటు ఆటకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇటీవలే మైదానంలో పడిపోవడంతో గాయం తిరగబడుతుంది అని  భయపడ్డారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: