గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో ఒకే చర్చ జరుగుతోంది. కేవలం 11 నెలల వ్యవధిలోనే టీమిండియాకు ఆరుగురు కెప్టెన్లు  మారారు. అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ మొదలవుతున్న సమయంలో టీమిండియా ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తోంది అన్న దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇదే విషయంపై అటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. 11 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు భారత జట్టును ముందుకు నడిపించడం అన్నది ప్రణాళికాబద్ధంగా జరిగింది కాదు అంటూ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు.


 అయితే ఇలా జరగడం వల్ల మరింత మంది నాయకులను తయారు చేసేందుకు మాత్రం తమకు అవకాశం దక్కింది అంటూ చెప్పుకొచ్చాడు.  కాగా టీ20 ప్రపంచకప్ తర్వాత ఏడాది ఇక టీమిండియా హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టాడు రాహుల్ ద్రావిడ్. అంతకుముందు జూలైలో శ్రీలంకలో పర్యటించిన జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. అప్పటి నుంచి శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా భారత కెప్టెన్ లుగా మారారు. ఒకేసారి రెండు దేశాల పర్యటనకు వెళ్లడం కొంత మంది ఆటగాళ్లు గాయాల బారిన పడిన కారణంగా ఇలాంటివి జరిగాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే  ఇలా ఎక్కువ మందికి కెప్టెన్సీ అప్పగించడం అనుకుని చేసింది కాదని.. భారత జట్టు చాలా మ్యాచ్లు ఆడడం వల్ల ఇలా జరిగింది అంటూ తెలిపాడు రాహుల్ ద్రావిడ్. ఇలా  జరగడం కారణంగా ఒక రకంగా టీమిండియాకు మంచే జరిగిందని. ఎంతో మంది నాయకులను తయారు చేసేందుకు అవకాశం వచ్చింది అంటూ తెలిపాడు. ఇక మరింత మెరుగయ్యేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ పరంగా చూస్తే దక్షిణాఫ్రికా పర్యటన కాస్త నిరాశ పరిచింది అంటూ తెలిపాడు రాహుల్ ద్రావిడ్. ఐపీఎల్ కారణంగా ఎంతోమంది ప్రతిభగల పేస్ బౌలర్లు వెలుగులోకి వస్తూ ఉండడం టీమిండియాకు శుభసూచికం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: