ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ దిగ్గజ జట్టుగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక ప్రతి ఏడాది కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎప్పుడూ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటుంది.  ముంబై ఇండియన్స్  తో మ్యాచ్ ఉందంటే చాలు ప్రత్యర్థులు వణికి పోతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా వరుస పరాజయాలను చవిచూసింది ముంబై ఇండియన్స్ జట్టు. రోహిత్ శర్మ సహా జట్టులో ఉన్న ఒక ఆటగాడు కూడా సరైన ప్రదర్శన చేయలేక పోయాడు. కేవలం యువ ఆటగాళ్ల ప్రదర్శన తోనే  ముంబై ఇండియన్స్ ముందుకు సాగింది అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టకుండా ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెత్త రికార్డును సృష్టించింది. ఈసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది పక్కా ప్లాన్ తో బరిలోకి దిగబోతోంది అని తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న భారత అన్ క్యాప్డ్ ప్లేయర్లకు అటు ట్రైనింగ్ కోసం ఇంగ్లాండ్ పంపించేందుకు సిద్ధమవుతున్నారట. మూడు వారాలపాటు ఇంగ్లాండ్ పిచ్ లపై ప్రాక్టీస్ చేయబోతున్నారట ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు. తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమన్ దీప్, థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్, అర్జున్ టెండూల్కర్,  డెవల్ట్ బేబీస్ లాంటి ఆటగాళ్లు ఇక ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కొత్త ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: