మొన్న ఐపీఎల్లో పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు రిషబ్ పంత్.  సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్ లో టీమిండియా కెప్టెన్సీ వహించే  అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఒక వైపు కెప్టెన్గా మరోవైపు ఒక ఆటగాడిగా కూడా పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో అతని  ఫామ్ టీమిండియాకు మైనస్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మాత్రం రిషబ్ పంత్  అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా 111 బంతుల్లో 146 పరుగులు చేసి అదరగొట్టి కష్టాల్లో కూరుకుపోయిన ఇండియా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కూడా 57 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే ఏకంగా 72 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు అనేది తెలుస్తుంది. మొత్తం రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 203 పరుగుల చేసాడు. దీంతో 1950లో వెస్టిండీస్ ఆటగాడు క్లయిడ్ వాల్కట్ రికార్డును బద్దలు కొట్టాడు. అప్పుడు వాల్ కాట్ ఇంగ్లాండ్ తో  జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ వికెట్ కీపర్ వాల్ కార్డ్  రెండు ఇన్నింగ్స్ లో 15, 168 పరుగులు చేశాడు. రెండు కలిపి 175 పరుగులు చేశాడు..


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ లో పర్యటించిన  వికెట్ కీపర్ లలో వాల్ కార్ట్ ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా   ఆటగాడిగా కొనసాగాడు. ఇప్పుడు రిషబ్ పంత్ 203 పరుగుల తో ఈ రికార్డును బద్దలు కొట్టాడు అనే చెప్పాలి. అదే సమయంలో ఇక మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న మరో రికార్డును సైతం రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు అన్నది తెలుస్తుంది. ధోని 2011 లో బర్మింగ్హామ్ వేదికగా రెండు ఇన్నింగ్స్ 77, 74 పరుగులతో 151 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు దాన్ని అధిగమించాడు పంత్. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టుపై ఓకే టెస్ట్ మ్యాచ్ లో ఒక శతకం ఒక అర్థ శతకం సాధించిన వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: