సాధారణంగా భారత జట్టులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, చాహల్, రవీంద్ర జడేజా సహా మరికొంతమంది స్పిన్నర్లు ఎప్పుడు టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియాకు పరిస్థితులు కలిసి వచ్చేలా చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో  మాత్రం ఎక్కువమంది స్పిన్నర్లు జట్టులో లేకపోవడం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. ఫాస్ట్ బౌలర్లు ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. దీంతో ముఖ్యమైన ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించి 2-2 తో సిరీస్ సమం చేసిన సంగతి తెలిసిందే.


 అయితే కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంగ్లాండ్ వెళ్లిన కీలకమైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అటు తుది జట్టులో లేకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో నెంబర్ 2 ఆల్ రౌండర్ బౌలర్ అయిన అశ్విన్ ను పక్కన పెట్టడం కూడా ఎంతో మంది మాజీ లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే మీడియా సమావేశంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు  ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. కేవలం ఒకే ఒక స్పిన్నర్ తో ఇంగ్లాండ్ తో పోటీకి వెళ్లాలనే నిర్ణయం సరైనది అంటారా.. అశ్విన్ తీసుకుంటే బాగుండేది కదా అంటూ విలేకరులు ప్రశ్నించగా.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు రాహుల్ ద్రవిడ్.


 మీరు చెబుతున్న దాంతో నేను అస్సలు అంగీకరించను. శార్దూల్ ఠాకూర్  ను సరిగా ఉపయోగించుకోలేదనీ మీరు అంటున్నారు.. నేను ఏకీభవించను. మీరు గతంలో అతని ప్రదర్శనలు చూస్తే.. టెస్టులలో ఎంతో బాగానే నిలకడగా రాణించాడు. కొన్ని గేమ్లలో మ్యాచ్ ను నిలబెట్టే ప్రదర్శనలు చేశాడు. అవసరమైన టైంలో అతను బౌలింగ్ కూడా వేశాడు. ప్రతిసారి  వికెట్లు పడాలని ఏమీ ఉండదు కదా అంటూ చెప్పుకొచ్చాడు. అశ్విన్ ను ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించడం చాలా కష్టమని.. అయితే ఫాస్ట్ బౌలర్లకు కాస్తా ఎక్కువ ఏడ్జ్ ఉన్న పిచ్ ఉండటం కారణంగా నాలుగో ఫాస్ట్ బౌలర్లను తీసుకుంటామంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: