సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం కి వచ్చిన అభిమానులు అందరూ కూడా తమ అభిమాన క్రికెటర్లను చూసి తెగ మురిసిపోతుంటారు. కొంతమంది ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ వీక్షిస్తూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు. ఇక తమ అభిమాన క్రికెటర్ల పేర్లను గట్టిగా అరుస్తూ చెప్పడం లాంటివి చేసి ఇక వారికి మద్దతు  ప్రకటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు విచిత్రమైన ప్లకార్డులు  చేతిలో పట్టుకుని కెమెరాల కంటబడటం కూడా చూస్తూ ఉంటారూ.  ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటివి చేయడానికి ఎవరైనా ప్రేక్షకులు స్టేడియం లోకి వస్తారు.



 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఒక వైపు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆత్మహుతి దాడి చేయడం మాత్రం సంచలనంగా మారిపోయిందని చెప్పాలి. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో నగరంలో వెలుగులోకి వచ్చింది.. ఇప్పటికే అక్కడ వరుసగా బాంబు దాడులు జరుగుతూ ఉండగా ఇటీవల క్రికెట్ స్టేడియంలో మరోసారి బాంబు దాడి జరగడం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. అలకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా ఈ ఆత్మహుతి దాడి చోటు చేసుకుంది. ఓ క్రికెట్ లీగ్లో భాగంగా ఇలా జరుగింది. స్టాండ్స్  లో కూర్చున్న అభిమానులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తున్నారు.


 ఇక ఇలాంటి సమయంలోనే అభిమానుల మధ్య ఈ పేలుడు సంభవించింది అని తెలుస్తుంది. ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో అక్కడున్న వారందరూ కూడా భయాందోళనలతో పరుగులు పెట్టారు. సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఈ ఆత్మాహుతి దాడిలో ఎంతో మంది ప్రేక్షకుల కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఇరు జట్ల ఆటగాళ్లను కూడా బంకర్లో సురక్షితంగా తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఐక్యరాజ్య సమితి అధికారులు కూడా స్టేడియం లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: