కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో టీమిండియా బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ అనూహ్యంగా తిరిగి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక దినేష్ కార్తీక్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అభిమానులు కూడా భావిస్తున్న తరుణంలో ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని తనకు సువర్ణవకాశంగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన ప్రతిభను బయటపెట్టి టీమిండియాలో ఆడాలని కసి తనలో ఎంత ఉందో తన ఆటతోనే  నిరూపించాడు. ఐపీఎల్ ద్వారా టీమిండియాలో అవకాశం దక్కించుకొని ఇక్కడ అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 తన కెరీర్లోనే అత్యుత్తమ ఫాంలో కొనసాగుతున్న దినేష్ కార్తీక్ ఎన్నో రోజుల నుంచి టీమిండియాను వేధిస్తున్న ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ చివర్లో వచ్చి జట్టుకు కావాల్సిన పరుగులను తన మెరుపు ఇన్నింగ్స్ తో అందిస్తున్నాడు దినేష్ కార్తీక్. టీ20 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్న దినేష్ కార్తీక్ సక్సెస్ అవుతున్నాడు  అనే చెప్పాలి. దినేష్ కార్తీక్ ఫామ్ చూస్తే ధోని తర్వాత టీమిండియాకు ఒక వరంలో దొరికాడు అని చెప్పాలి. ఇక ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో 16 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇండియా స్కోర్ 138 గా ఉంది.


 ఇక ప్రత్యర్థికి మెరుగైన టార్గెట్ అందించాలంటే కనీసం మరో 50 పరుగుల అయినా కావాలి. అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చాడు  దినేష్ కార్తీక్. 19 బంతుల్లో 41 పరుగులు చేసి అదరగొట్టాడు. 4 ఫోర్లు 2 సిక్సర్లతో చెలరేగిపోయి  టీమిండియాకు 190 పరుగులు గౌరవప్రదమైన స్కోరు వచ్చేలా చేశాడు. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ బ్యాటింగ్ లో ఆడిన కొన్ని షాట్లు ప్రస్తుతం అభిమానులను అలరిస్తున్నాయ్. ఇలాంటి షాట్ లు కేవలం దినేష్ కార్తీక్ కె సాధ్యం అని కొంతమంది వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: