ఇటీవలి కాలంలో ఎన్నో ప్రయోగాలతో ప్రేక్షకులందరినీ కన్ఫ్యూజన్లో పడేస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ప్రతి మహిళ కూడా ఏ ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడా అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడి విషయంలో గత కొంత కాలం నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లకు వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ కు మూడో వన్డే మ్యాచ్లో ఓపెనర్ గా అవకాశం ఇచ్చింది మేనేజ్మెంట్.


 కేఎల్ రాహుల్ గైర్హాజరు నేపథ్యంలో ఇక సూర్య కుమార్ యాదవ్ కు ఓపెనర్ గా ప్రమోషన్ వచ్చింది అన్నది తెలుస్తుంది.. తొలి రెండు టి 20 మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు సూర్యకుమార్ యాదవ్. మూడో టి-20లో మాత్రం అదరగొట్టేశాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 76 పరుగులతో విధ్వంసంపై సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏడు వికెట్ల తేడాతో ఎంతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది భారత జట్టు. ఇక ఐదు టీ20 సిరీస్ లో భాగంగా 2-1 తో ఆధిక్యంలో కొనసాగుతోంది అని చెప్పాలి. అయితే మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ ను ఇషాన్ కిషన్ సరదాగా ఇంటర్వ్యూ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.


 ఇక ఇంటర్వ్యూ లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిషా కు ఇషాన్ కిషన్ వినూత్నమైన విజ్ఞప్తి చేశాడు. అసలు భారత మ్యాచ్ లకు హాజరుకావొద్దు అంటూ విజ్ఞప్తి చేశాడు. అయితే సూర్య రెండు భారీ ఇన్నింగ్స్  లకు  దేవిషా హాజరు కాలేదు. గతంలో ఇంగ్లండ్ పర్యటనలో సెంచరీ చేసిన సమయంలో దేవిషా హాజరు అవ్వ లేదు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ రాణించాలంటే ఇక అతని సతీమణి దేవిషా మ్యాచ్ కు రాకపోవడమే మంచిది అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషన్. సూర్యకుమార్ మాత్రం ఈ వాదనను తప్పుబట్టాడు. తన జీవిత భాగస్వామి మ్యాచ్ రావాల్సిన అవసరం లేదని.. ఎప్పటికీ తను నాతోనే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇషన్ కిషన్ మాట్లాడుతూ దేవిషా బాబీ. మీరు మా రూమ్స్ బిల్లులు చెల్లించండి.. అలాగే తదుపరి మ్యాచ్లకు హాజరు కాకండి అంటూ జోక్ వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: