గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టు ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా  విదేశీ పర్యటనకు వెళుతున్న టీమిండియా అక్కడ అన్ని ఫార్మాట్ల తో కూడిన సిరీస్ లు ఆడుతుంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా అద్భుతమైన  ప్రదర్శనతో ఆతిథ్య జట్టుపై వరుస విజయాలు సాధిస్తూ సిరీస్ను కైవసం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టు మ్యాచ్ల్లో ఓడి పోయి నిరాశపర్చిన టీమిండియా.. ఆ తర్వాత వన్డే టి20 సిరీస్  మాత్రం కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరిన టీమిండియా.. అక్కడ ఇదే జోరు కొనసాగించింది. ఈ క్రమంలోనే మొదట వన్డే సిరీస్లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో చివరికి క్లీన్ స్వీప్ చేసింది. ఇక టీ20 సిరీస్ లో కూడా అదే రేంజ్ లో అదరగొట్టింది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే మూడు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా ఇటీవల జరిగిన నామమాత్రమే ఐదో మ్యాచ్లో కూడా అదే రీతిలో అదరగొట్టింది. ఏకంగా 88 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి తమకు తిరుగులేదు అని నిరూపించింది టీమిండియా.


 వెస్టిండీస్తో చివరిదైన ఐదవ టీ20 మ్యాచ్లో భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 189 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ అయ్యర్ 64 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. అయితే 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది అని చెప్పాలి. ఇక భారత బౌలింగ్  విభాగంలో నాలుగవ టి-20లో జట్టులోకి వచ్చిన రవి బిష్ణయ్ 4 వికెట్లు,అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. తద్వారా 4-1 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకొని అదరగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: