ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.  న్యూజిలాండ్ సాధిస్తున్న విజయాలలో అటు ట్రెంట్ బౌల్ట్ కీలకపాత్ర వహిస్తున్నాడు అని చెప్పాలి. అయితే న్యూజిలాండ్ లో మాత్రమే కాకుండా ఐపీఎల్ కారణంగా భారత్లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ట్రెంట్ బౌల్ట్. అయితే గత కొంత కాలం నుంచి మంచి ఫాంలో కొనసాగుతున్న ఈ స్టార్ బౌలర్ ఇటీవలే అభిమానులకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కూడా ఊహించని షాక్ ఇచ్చాడు అని చెప్పాలి.


 ఏకంగా ఆ దేశ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ట్రెంట్ బౌల్ట్ ఇటీవలే ప్రకటించాడు. ఇక ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే అధికారికంగా ధ్రువీకరించింది అన్నది తెలుస్తుంది. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి అని ఉద్దేశంతోనే ఇలా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఇటీవలే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే ట్రెంట్ బౌల్ట్ నిర్ణయంతో  సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ జాతీయ జట్టుకు ఎంపిక కు అతని సమ్మతితో పరిగణలోకి తీసుకుంటాము అంటూ తెలిపింది.


 అదే సమయంలో ట్రెంట్ బౌల్ట్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకొనే అవకాశం కూడా ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే తమ దేశ స్టార్ బౌలర్ సెంట్రల్ కాంట్రాక్ట్  నుంచి పక్కకు తప్పుకోవడం బాధాకరం అంటూ చెప్పుకొచ్చింది. అయితే బౌల్ట్ భవిష్యత్తులో మరింత బాగుండాలి అంటూ ఆకాంక్షించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.  ఇన్నాళ్ళ వరకు అతను జట్టుకు చేసిన సేవలను కొనియాడింది అని చెప్పాలి. న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్టు లేదా డొమెస్టిక్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లను  మాత్రమే జాతీయ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ట్రెంట్ బౌల్ట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం కారణంగా అనధికారికంగా న్యూజిలాండ్ జట్టుకు గుడ్ బై చెప్పినట్లే అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: