క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుందేమో. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు  ప్రపంచ క్రికెట్లో హవా నడిపించిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆయన సృష్టించిన రికార్డులు మాత్రం ఎన్నో పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ను ఇటీవలే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒక సహాయం కోరింది. ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది వెస్ట్ఇండీస్ జట్టు. భయంకర బౌలర్లు విధ్వంసకర బ్యాట్స్మెన్లు. వెస్టిండీస్తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్ధి వెన్నులో వణుకు పుట్టేది. ఆ రేంజ్లో  హవా నడిపించింది. కానీ 1983లో వన్డే వరల్డ్ ఫైనల్లో టీమ్ ఇండియా చేతిలో ఓడిపోయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది  జట్టులో ఉన్న లెజెండరీ క్రికెటర్లు వరుసగా రిటైర్మెంట్ ప్రకటించడం తో జట్టు బలహీనంగా మారింది. అయితే ప్రస్తుతం జట్టులో కొంతమంది స్టార్లు ఉన్నప్పటికీ కూడా సరైన విజయాలు అందుకోలేక నష్టాల్లో కూరుకుపోతుంది.


 అంతే కాదండోయ్ ఆర్థికమాంద్యం కారణం గా వెస్టిండీస్ బోర్డు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమం లోనే వెస్ట్ ఇండీస్ దిగ్గజ క్రికెటర్ విన్స్టన్ బెంజిమన్ భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహాయం కోరాడు. కొన్ని క్రికెట్ కిట్స్ పంపాలి అంటూ వేడుకున్నాడు. మా కుర్రాళ్లకు సరైన గైడెన్స్ ఇచ్చేందుకు కొన్ని క్రికెట్ కిట్స్ కావాలి అంటూ తన ఫోన్ నెంబర్ ని కూడా ఇక ట్విట్టర్ వేదికగా ఓ పోస్టులో పెట్టడం గమనార్హం. అయితే దీనిపై సచిన్  మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. కాగా ఇలా కోరినందుకు మహ్మద్ అజారుద్దీన్ కిట్స్ పంపాడు అంటూ అతనికి ధన్యవాదాలు తెలిపారు బెంజమన్.

మరింత సమాచారం తెలుసుకోండి: