ప్రస్తుతం బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా సరికొత్త టీ20 లీగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఎంతో గ్రాండ్ గా ఇక ఈ టి20 లీగ్ ను ప్రారంభించాలని భావిస్తూ ఉంది. అయితే ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించే టి20 లీగ్ లో భాగంగా దాదాపు ఆరు జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీల కొనుగోలు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కాస్త దక్షిణాఫ్రికాలో జోహాన్నెస్బర్గ్ జట్టును కొనుగోలు చేసింది.


 ఈ క్రమంలోనే ఇక తమ జట్టు పేరును జోహెన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ అని ఫిక్స్ చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది అని ఎంతో మంది భావించారు. కాగా అందరూ అనుకున్నట్టుగానే ప్రస్తుతం మొన్నటి వరకు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో భాగమైన ఆటగాళ్ళు ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన జోహన్నెస్బర్గ్ జట్టులో ఆడ బోతున్నారు. సిఎస్కే మాజీ ఆటగాడు డుప్లెసిస్ కి జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.. దీంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 అయితే జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ జట్టు కి స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్గా నియమితులయ్యారు.. అయితే అటు ఐపీఎల్ విషయానికి వస్తే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ డుప్లెసిస్ ని వేలంలో కి విడుదల చేసింది. ఈ క్రమంలోనే కొత్త సారథి కోసం వేట ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక డుప్లెసిస్ ను జట్టులోకి తీసుకోవడమే కాదు కెప్టెన్సీ కూడా అప్పగించింది అన్న విషయం తెలిసిందే. అతని సారథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 లీగ్ లో ఒక మినీ సీఎస్కే జట్టు బరిలోకి దిగబోతోంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk