టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ఇటీవల తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన చిరకాల ప్రత్యర్థి  అయిన నాదల్ తో తన చివరి మ్యాచ్ ఆడాడు ఫెదరర్. అయితే ఈ మ్యాచ్ లో ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్న టెన్నిస్ స్టార్ ఫెదరర్  మాత్రమే కాదు నాదల్ కూడా ఏడ్చేసాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇటీవల లెవర్ కప్ లో భాగంగా డబుల్స్ ఆడిన ఇద్దరు కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత తమ కన్నీళ్లు మాత్రం ఆపుకోలేకపోయారు.


 స్టార్ టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ స్పెయిన్ బుల్ నాదల్ అటు టెన్నిస్ లో ఎంత బీకరమైన ప్రత్యర్థిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ అటు ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ అందించేవారు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఇక ఇద్దరూ కూడా సమానమైన విజయాలతో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల లెవర్ కప్ లో భాగంగా మ్యాచ్ ముగిసిన తర్వాత నాదల్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన చిరకాల ప్రత్యేకమైన ఫెధరర్ కోసం నాదల్ ఏడవడం చూసి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. అయితే  ఈ ఫోటో పై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.


 ప్రత్యర్థి నాదల్ కన్నీళ్లు ఫెదరర్ టాలెంట్ను ప్రూ చేస్తున్నాయని విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఇద్దరు ప్రత్యర్థులు ఒకరి కోసం ఒకరు ఇలా ఏడ్చేస్తారని ఎవరు అనుకుంటారు చెప్పండి. కానీ క్రీడల్లో ఉన్న ఆనందమే ఇది అంటూ విరాట్ కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. క్రీడా స్ఫూర్తిని చాటుకున్న గొప్ప ఫోటో ఇదే అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. నీ సహచరులు నీకోసం కన్నీళ్లు కారుస్తుంటే దేవుడు ఇచ్చిన మీ ప్రతిభను మెచ్చుకోని వారు ఇంకెవరు ఉంటారు అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఫెదరర్ నాథల్ ను గౌరవించడం తప్ప ఇంకేమీ చేసేది లేదని కోహ్లీ ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: