ఎందుకంటే సిక్సర్లు ఫోర్ లతో వీర విహారం చేస్తూ బౌలర్ల పై పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా సెంచరీలతో ఊగిపోతున్నాడు అని చెప్పాలి. సెంచరీలు బాగానే చేస్తున్నాడు కదా అందులో విచిత్రం ఏముంది అని అని అనుకుంటున్నారా.. అయితే ఈ ఆటగాడి గురించి మరో విషయం కూడా దాగి ఉంది. వరుసగా సెంచరీలు చేస్తున్న ఈ ఆటగాడు ఒకవేళ సెంచరీలు చేయలేదంటే ఇక డక్ అవుట్ గా వెను తిరుగుతూ ఉండడం గమనార్హం. అయితే సెంచరీ లేదంటే డక్ అవుట్ అన్న విధంగానే తన ఆట తీరును కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.
సదరు ఆటగాడు ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రూసో. అతని గురించి తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. రూసో ఆడిన ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు చూసుకుంటే 2(0), 56( 109), 48 బంతుల్లో (100), 1(0) సున్నా ఇలా అయితే సెంచరీ లేదంటే డక్ అవుట్ అనే విధంగా ఆటతీరును కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 109 పరుగులు చేయగా ఇటీవల ఇండియా పై జరిగిన మ్యాచ్ లో మాత్రం డక్ అవుట్ గా వెనతిరిగాడు. సౌత్ ఆఫ్రికా తర్వాత మ్యాచ్ నవంబర్ మూడో తేదీన పాకిస్తాన్తో ఆడబోతుంది. అందులో ఏం చేస్తాడో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి