ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో అన్ని జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో స్పోర్టివ్ నెస్ తో ప్రత్యర్థులతో కూడా స్నేహ భావంతో మెలుగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఏదైనా జట్టుతో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు తమ బలాబలాలపై మాట్లాడడమే కాదు ఇక ప్రత్యర్థి బలాలు ఏంటి అన్న విషయంపై కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇక భారత బౌలింగ్ విభాగం పై ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. నేటి నుంచి ఇక హార్థిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టి20 సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి.


 వరల్డ్ కప్ లో చోటు దక్కక నిరాశలో మునిగిపోయిన ఎంతో మంది ఆటగాళ్ళకు టీమిండియాలో చోటు దక్కింది. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా బౌలింగ్ విభాగం పై న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ఫార్మాట్లో ప్రతి జట్టు లెగ్ స్పిన్నర్ ఉండాలని కోరుకోవడం సహజం. మ్యాచ్ విజేతగా నిలిపే సామర్థ్యం వారికి ఉంటుంది. మాకు ఐష్ సోది ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కు రషీద్ ఖాన్ ఉన్నాడు  ఇక భారత్ ఎక్కువగా చాహల్ బౌలింగ్ వినియోగించుకోవాలి. అయితే జట్టు ఎంపిక ఎలా ఉంటుందో నాకైతే తెలియదు.


 కానీ భారత జట్టు బౌలింగ్ దళంలో మాత్రం లెగ్ స్పిన్నర్ అయినా చాహల్ కీలక పాత్ర పోషిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వికెట్ కు ఇరువైపులా బంతిని టర్న్ చేయగల సామర్థ్యం చాహల్ సొంతం. అలాగే చిన్న మైదానం అయిన వెల్లింగ్ టన్ లో బంతిని బ్యాట్స్మెన్లు అంచనా వేయగలగాలి. అప్పుడే బ్యాటింగ్కు ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే అనుకున్నంత సులువుగా పరుగులు సాధించడం మాత్రం కష్టతరం అవుతుంది అంటూ గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. కాగా నేటి మ్యాచ్లో చాహల్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: