టి20 వరల్డ్ కప్ ముగిసింది. కానీ ఇక ఈ వరల్డ్ కప్ కు సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. ఏదో ఒక సరికొత్త విషయాన్ని తెరమిదికి తీసుకువస్తూ ఇక అటు టి20 వరల్డ్ కప్పుకు సంబంధించిన విషయాలను చర్చించుకుంటూనే ఉన్నారు అని చెప్పాలి  అయితే నవంబర్ 13వ తేదీన మేల్ బోర్న్ వేదికగా పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ను ఓడించిన ఇంగ్లాండ్ జట్టు రెండవసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఇక నెంబర్ వన్ స్థానంలో ఇంగ్లాండ్ నెంబర్ 2 స్థానంలో పాకిస్తాన్ నిలిచాయి అని చెప్పాలి.


 అయితే అంతకుముందు మొదటి సెమి ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో న్యూజిలాండ్.. రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయాయి. ఇక ఈ రెండు జట్లలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్న జట్టు ఏది అన్న చర్చ జరిగింది అని చెప్పాలి.  కేవలం చర్చ జరగడమే కాదు ప్రస్తుతం ఇక ఇలాంటి ప్రశ్న అటు హార్దిక్ పాండ్యా, కేన్ విలియమ్సన్ లకు ఎదురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా ఆసక్తికర సమాధానాలను చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్ ముగిసింది దాన్ని అక్కడే వదిలేసాం. సెమీఫైనల్ లో ఓడిపోయినందుకు కాస్త నిరాశగా ఉన్న మాట నిజమే. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలితాలు మారిపోవు కదా. ఇక ఇప్పుడు ఫోకస్ అంతా టి20 సిరీస్ పైనే ఉంది అంటూ హార్దిక్ సమాధానం చెప్పాడు.


 సెమీఫైనల్ ఫలితం మమ్మల్ని ఎంతోగానో బాధపెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం ఇక ఓడిపోయిన విషయం గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు. కేవలం టి20 సిరీస్ పైనే ఫోకస్ పెట్టాం. మూడో స్థానం ఎవరిది అంటే చెప్పడం కష్టం. హార్దిక్ నువ్వు ఏమంటావ్.. నీ లెక్క ఏంటి అంటూ సమాధానం ఇచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్. మేము ఫైనల్ ఆడాలి అనుకున్నాం కానీ సెమిస్ లో ఓడిపోవడం కారణంగా అనుకోకుండా విశ్రాంతి దొరికింది. ఇక పాత విషయాలను మర్చిపోయి సిరీస్ ని ఫ్రెష్ గా ఆరంభించాలని అనుకుంటున్నాం అంటూ కేన్ విలియమ్సన్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: