
అయితే ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న నేపథంలో ప్రస్తుతం ఇక ఆయా జట్లలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లకు సంబంధించిన వార్తలు ఏదైనా వెలుగులోకి వచ్చాయి అంటే చాలు అది వైరల్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియన్ రోనాల్డో కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ కి వచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు క్రిస్టియానో రోనాల్డో.
మంచెస్టర్ యునైటెడ్ తోపాటు ఆ జట్టు కోచ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మేనేజర్ తనకు ద్రోహం చేశాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. అయితే ఇక మాంచెస్టర్ యునైటెడ్ తో గొడవ కారణంగా ప్రపంచ కప్ లో తన జట్టుపై ఎలాంటి ప్రభావం పడబోదు అంటూ క్రిస్టియన్ రోనాల్డో చెప్పుకొచ్చాడు. ఆ క్లబ్ తో విభేదాలు ఆటగాడిగా నన్ను ప్రభావితం చేయొచ్చు. కానీ ఇటువంటి గొడవలు వ్యక్తిగత విభేదాలు మా జట్టుపై ఏమాత్రం ప్రభావం చూపవు అంటూ తెలిపాడు. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా పోర్చుగల్ జట్టు తమ మొదటి మ్యాచ్ లో ఈనెల 24వ తేదీన ఆడబోతుంది అని చెప్పాలి.