మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదిక జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు టైటిల్ గెలుస్తుంది అనుకుంటే సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా వైఫల్యానికి కారణం ఏమైనా ఉంది అంటే అది జట్టులో సరైన ఆల్ రౌండర్లు లేకపోవడమే అన్నది ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో జట్టులో ఆల్ రౌండర్ల సంఖ్యను పెంచుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది అన్న ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇక ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియ రెండవ టి20 మ్యాచ్ ఆడిన సందర్భంలో దీపక్ హుడా ఏకంగా 2.5 ఓవర్లలోనే పది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.


 ఇలా ఆల్ రౌండర్ గా బరిలోకి దిగి ఒకవైపు బ్యాట్ తో మరోవైపు బంతితో కూడా ఆకట్టుకున్నాడు. దీంతో పాత రోజులనీ నెమరు వేసుకుంటున్నారు ఎంతోమంది మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఒకప్పుడు జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగిన సచిన్, గంగూలి, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు జట్టుకు అవసరం అనుకున్న సమయంలో బౌలర్లుగా మారి  పదుల సంఖ్యలో ఓవర్లు వేసి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. ఇక టెస్ట్ ఫార్మాట్ లో అయితే 30, 40 ఓవర్లు వేసిన సందర్భాలు  ఉన్నాయి. కేవలం బౌలింగ్ వేయడమే కాదు వికెట్లు కూడా పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు.


 అదే సమయంలో ఇక బౌలర్లుగా పేరు ఉన్న అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు ఇక కష్ట సమయంలో ఎన్నోసార్లు బ్యాట్ తో మెరిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కానీ ప్రస్తుత టీమిండియా విషయానికి వస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆల్ రౌండర్ల కొట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్స్  బ్యాటింగ్ కే పరిమితం అవుతున్నారు. ఇక బౌలర్లు కూడా కేవలం బౌలింగ్ మాత్రమే చేయగలుగుతున్నారు. కానీ ఇప్పటికైనా పరిస్థితులకు తగ్గట్లుగా మారాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సహ మరి కొంతమంది స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు బౌలింగ్ పై కూడా దృష్టి పెట్టి ఇక ఆల్రౌండర్లుగా మారితే బాగుంటుందని కొంతమంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: