నేటి రోజుల్లో మనుషుల్లో ఉండే మానవత్వం పూర్తిగా కనుమరుగయ్యిందా... సాటి మనుషుల విషయంలోనే కాదు కనీసం మూగజీవాల విషయంలో మానవత్వాన్ని చూపించలేకపోతున్నారా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవును అనే సమాధానం చెబుతూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతోమంది ఏకంగా మూగజీవాలను హింసిస్తూ రాక్షసుతానందం పొందుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది అని అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.


 నేటి రోజుల్లో  ఎంతోమంది అటు కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఇంట్లో మనిషిలా చూసుకుంటూ ఉండటం చూస్తూనే ఉన్నాం. దీంతో మనుషుల కంటే  కుక్కలకే ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగిపోయింది అని కొంతమంది కాస్త ఫన్నీ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. కానీ కుక్కలను ప్రేమగా పెంచుకుంటుంటే.. కొంతమంది అయితే అదే కుక్కలను దారుణంగా కొట్టి చంపేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. గర్భంతో ఉన్న కుక్కను దారుణంగా కొట్టి రాక్షసానందాన్ని పొందారు ఇక్కడ  యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


 న్యూ ఢిల్లీ లోని ఒక్లా రోడ్ జామియా నగర్ లో డాన్ బాస్కో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కి చెందిన నలుగురు విద్యార్థులు న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతం లోని బేస్బాల్ బ్యాట్లు, ఇనుపరాడ్లతో వచ్చి ఓ గుడిసెలో తలదాచుకున్న గర్భం తో ఉన్న కుక్కను ధారణంగా కొట్టారు. చివరికి దెబ్బలు తాళలేకపోయినా  కుక్క ప్రాణాలు వదిలింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోవడంతో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రతిరోజు మొరుగుతుండడంతో చిరాకు వచ్చి ఇలా దానీపై దాడి చేశామని విద్యార్థులు పోలీసులకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: