ప్రస్తుతం టీమిండియా యాజమాన్యం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేసిందా అంటే ప్రస్తుతం బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవును అని సమాధానమే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కొంతమంది ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు ఫేవరెటిజం చూపిస్తున్నారేమో అని అనుమానం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ముఖ్యంగా గత కొంతకాలం నుంచి పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్న టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఆయన రిషబ్ పంత్ విషయంలో టీమిండియా
 యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. 2017లో టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. ఇప్పటికే 124 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 31 టెస్టులు 27 వన్డేలు 66 టీ20 లు ఉన్నాయి. 2019 ప్రపంచ కప్ తో పాటు 2021, 2022 టీ20 వరల్డ్ కప్లలో కూడా అతను భాగం అయ్యాడు. ఇక ఇలాంటి గణాంకాలు చూస్తే అతనికి ఎంతో అనుభవం ఉండాలి.ఎప్పుడు ఎలా ఆడాలి అనే అవగాహన ఉండాలి.


 కానీ రిషబ్ పంత్ ఇంకా అప్పుడప్పుడే జట్టు లోకి వచ్చిన యువ ఆటగాడి లాగా ప్రతి మ్యాచ్ లో తడబడుతూ ఉన్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. ఇక ఇటీవలే టి20 సిరీస్ లో కూడా చేతులెత్తేస్తాడు. చెత్త షాట్లతో వికెట్ చేజార్చుకుంటూ పెవీలియన్ చేరుతున్నాడు. ఇంత పేలవ ప్రదర్శన చేస్తున్న బీసీసీఐ సెలెక్టర్లు అతన్ని తుది జట్టు లోకి తీసుకుంటూనే ఉన్నారు. అంతేకాదు అతను ఫ్యూచర్ కెప్టెన్ అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇంత అనుభవం ఉన్న సరిగ్గా షాట్ సెలక్షన్ చేయడమే రాదు.. అతను ఫ్యూచర్ కెప్టెన్ ఏంటి అంటూ కొంతమంది అభిమానులు మాత్రం అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: