2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్న టీమిండియా పక్క ప్లాన్ తో ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న పది ఫ్రాంచైజీలు  కూడా తమతో అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను వదిలేసుకోబోయే ప్లేయర్స్ డీటెయిల్స్ కూడా బీసీసీఏ కి అందించాయి.


 ఈ క్రమంలోనే కొచ్చి వేదికగా డిసెంబర్ 23వ తేదీన ఐపీఎల్ మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మినీ వేలంలో ఎంతోమంది ఆటగాళ్ళను తమ జట్టులోకి తీసుకుని ఇక జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు  ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఐపీఎల్ వేలంలో పాల్గొనాలి అనుకుంటున్నా ఆటగాళ్లకు ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి డెడ్ లైన్ విధించింది. వేలం బరిలో ఉండాలనుకునే ఆటగాళ్లు డిసెంబర్ 15లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


 డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా వేలంలో పాల్గొనాలి అని ఆటగాళ్లు. ఇక తమ పేర్లను ఎన్ రోల్ చేసుకోకపోతే మాత్రం మినీ వేళానికి వాళ్లు అనర్హులు అంటూ ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే మినీ వేలంలో భాగం కావాలని భావిస్తున్న ఎంతోమంది ఆటగాళ్లు ఇక తమ పేరును ఎన్ రోల్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు అని చెప్పాలి. అయితే 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకొని మొత్తంగా250 మంది ప్లేయర్స్ వరకు ఇక డిసెంబర్ 23వ తేదీన జరగబోయే మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఉందని బిసిసిఐ అంచనా వేస్తోంది. ఇక ఇందులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl