సాధారణంగా క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక క్రికెటర్లు బాగా రానించి ఏదైనా రికార్డు కొల్లగొడితే అందరూ దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అలాంటిది క్రికెటర్ల ప్రేమకి సంబంధించిన విషయం బయటికి వచ్చిందంటే ఏకంగా మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినంత పని అవుతుంది అని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అందుకు సంబంధించిన వార్తలే ప్రత్యక్షమవుతూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు ఏకంగా క్రికెటర్లకు సంబంధించిన పెళ్లి విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కావాలనే ఇలా చేసుకున్నారా అని ప్రతి ఒక్కరు ఆలోచనలో పడిపోయారు. అదేంటి క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణం.  అందులో ఆశ్చర్య పోవాల్సిన పని ఏముంది అని అనుకుంటున్నారు కదా. సాధారణంగా ఒక క్రికెటర్ పెళ్లి జరగడం కామన్. కానీ ఏకంగా ఒకే జట్టులో ఉన్న ముగ్గురు స్టార్ క్రికెటర్లకు చెందిన పెళ్లి ఒకే రోజు జరిగితే మాత్రం అది కాస్త స్పెషల్ అని చెప్పాలి.


 ఇదే ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. శ్రీలంక జట్టులో స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న కసున్ రజిత, చరిత్ అసలంక, పతుమ్  నిస్సాంక కోలాంభోలో వేరువేరు చోట్ల ఒకేరోజు పెళ్లి చేసుకున్నారు అని చెప్పాలి. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆ దేశ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.. అయితే ప్రస్తుతం ఈ క్రికెటర్లు అందరూ కూడా ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న 3 వన్ డేలా సిరీస్ లో ఉన్నారు. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్లు జరిగాయి. ఈ క్రమంలోనే మూడో వన్డే మ్యాచ్లో మళ్లీ ఈ ముగ్గురు క్రికెటర్లు జట్టుతో చేరబోతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: