న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో గిల్ సూపర్ డబుల్ సెంచరీ తో రెచ్చిపోయాడు అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగులు వేస్తున్న శుభమన్ గిల్ ఇక తక్కువ సమయంలోనే ఇలా డబల్ సెంచరీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇక ఈ అరుదైన రికార్డును సృష్టించాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే అత్యంత చిన్న వయసులో ఇక ద్విచతకం సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సైతం సృష్టించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక న్యూజిలాండ్ భారత మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులు శుభమన్ గిల్ ద్విశతకం గురించి చర్చించుకుంటున్నారు. ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అతను ఆడిన షాట్స్ అత్యద్భుతం అంటూ ఇప్పటికే భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అయితే ఇవ్వలే మరో మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ సైతం అతన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు అని చెప్పాలి. ఒకప్పుడు ధోని తరహా లోనే ఇక ఇప్పుడు గిల్ కూడా అదిరిపోయే సిక్సర్లు కొడుతున్నాడు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.


 నేను తొలిసారి మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసినప్పుడు అతను ఎక్కువగా స్ట్రైట్ సిక్సర్లు కొడుతూ కనిపించేవాడు. ఇక ఇలా అయితేనే భారీ షాట్లుగా మలచగలను  అని అప్పుడు ధోని నాతో చెప్పాడు. అయితే ఇక ఇప్పుడు శుభమన్ గిల్ సైతం ఇలాంటి షాట్లను కొడుతున్నాడు. అతని బ్యాటింగ్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది అంటూ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించాడు. కాగా 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు గిల్. అంతకుముందు సునీల్ గవాస్కర్ సైతం ప్రశంసించాడు. గిల్  23 ఏళ్ల కుర్రాడిలా కాదు.. 35 ఏళ్ల యువకుడిలా కనిపించాడు.అతని షాట్ సెలక్షన్ బాగుంది. ఇక ఇన్నింగ్స్ నిర్మించిన విధానం కూడా అద్భుతం అంటూ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: