అలాంటి సూర్య కుమార్ యాదవ్ మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో కూడా పరుగుల ఖాతా తెలవకుండానే డక్ అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే ఫార్మాట్లో ఎలా ఉన్నప్పటికీ టి20 ఫార్మాట్లో మాత్రం సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ ప్రస్తుతం టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్.
ఇక వరుసగా మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం సమయంలో సూర్య కుమార్ యాదవ్ కాస్త జాగ్రత్తగా ఆడాలని సూచించాడు రవి శాస్త్రి. సూర్య కుమార్ తప్పక పుంజుకుంటాడు. త్వరలోనే అది జరుగుతుంది. అయితే టీ20 క్రికెట్ అయినప్పటికి ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త సమయం తీసుకోవాలి అన్నది అతడికి నా సలహా.. అంటే నా ఉద్దేశం 20 నుంచి 30 నిమిషాలు కాదు. 6 లేదా 8 బంతులు జాగ్రత్తగా ఆడితే చాలు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి