అయితే అర్జున్ టెండూల్కర్ లాగానే మరో యువ ఆటగాడు ప్రదర్శన చేసి ఉంటే అందరూ ఊరుకునేవారేమో. కానీ సచిన్ తనయుడు ఇలాంటి ప్రదర్శన చేయడంతో అస్సలు సహించలేకపోతున్నారు. సచిన్ కొడుకు అయ్యుండి ఇలాంటి ప్రదర్శన చేయడమేంటి అన్నట్లుగా విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఇటీవల పంజాబ్ తో మ్యాచ్ తర్వాత జహీర్ ఖాన్ తో అర్జున్ గురించి మాట్లాడాను.
అర్జున్ నెట్స్ లో చాలా తీవ్రంగా శ్రమిస్తాడని.. అతని డేడికేషన్ అద్భుతం అంటూ జహీర్ ఖాన్ చెప్పాడు. అందుకే క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడిలా కాకుండా అర్జున్ టెండూల్కర్ ని వ్యక్తిగతంగా మాత్రమే జడ్జ్ చేయాలని అందరికీ చెబుతున్నా. తప్పకుండా రానున్న రోజుల్లో అర్జున్ టెండూల్కర్ మెరుగు అవుతూనే ఉంటాడు. టి20 క్రికెట్ ను ఆడుకున్నంత కాలం స్కిల్స్ ను పెంచుకుంటూ వెళ్లాలి. ఇలాంటి మెగా లీగ్లలో రాణించాలి అంటే అవి మరింత ముఖ్యం. భారీ హిట్టర్లు కలిగిన గుజరాత్ పై అర్జున్ 2 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చాడు. ఇది అంత సులభమైన విషయం కాదు అంటూ ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. అతనికి యార్కర్లు వేసే నైపుణ్యం కూడా ఉందని రానున్న రోజుల్లో మరింత మెరుగవుతాడు అంటూ అభిప్రాయపడ్డాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి